Saturday, May 7, 2011

లవ్వు లక్షణాలు...

కుర్రజంటలు ప్రేమలో పడ్డాయా, ఇక వాళ్ల ఆనందాలకు హద్దే ఉండదు. ఊసులు, కబుర్లు, షికార్లు, రొమాంటిక్‌ సనిమాలు.. ఇదంతా ఓకే. కానీ మీ లవర్‌ మనసులో ఉన్నది నిజమైన ప్రేమేనా..? లేక ఒట్టి టైంపాసేనా...? తెలుసుకోవడం ఎలా..?
చూపులు కలిసేది క్షణకాలం..! కానీ యువ హృదయాలు ఊసులాడుకునేది యుగకాలం..! ప్రేమలో ఎలా పడ్డావు బాసూ...? అని... అని ఓ లేత ప్రేమికుడిని అడిగితే కోటిన్నొక్క కారణాలు చెబుతాడు. అదే ఓ సైంటిస్టునడిగితే..? మానసిక స్థితిగతులు బట్టి సమాధానం చెబుతాడు. అబ్బాయిగారు మాత్రం ప్రేమలో ఇంకా ఏదో ఉందంటూ తపనపడిపోతాడు. అందమైన ప్రేమరాణి చేయితగిలితే అన్నట్టు.. ప్రేమ పుట్టడానికి ప్రధాన కారణం ఆకట్టుకునే రూపమేనని స్కాట్లాండ్‌కు చెందిన ఓ సైకాలజిస్టు తేల్చాడు. అమ్మాయిని అందంతోపడేసినా.. ఆ తర్వాత కథ నడవాలంటే ఆకట్టుకునే వ్యక్తిత్వం ఉండాలట. ఇక మరో ప్రొఫెసర్‌ అయితే... కొంత మంది అమ్మాయిలను, అబ్బాయిలను ఎంపిక చేసి ఓ ప్రయోగం చేశాడు. వాళ్లను జంటలుగా విడదీసి.. కొందరిని కళ్లల్లోకి కళ్లు పెట్టి 90 నిమిషాలు మాట్లాడిస్తే, ఇంకొంతమందిని దిక్కులు చూస్తూ... కబుర్లు చెప్పమన్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే.. మొదటి జంటల్లో కొంతమంది లవర్లుగా మారిపోయారు. రెండు జంటలైతే ఏకంగా పెళ్లికి రెడీ అయిపోయారట. అబ్బాయిల్లోని కొన్ని లక్షణాలను బట్టి ప్రేమ ఘాటెంతో పసిగట్టవచ్చు... అమ్మాయి పిలిచిదే తడవుగా వచ్చి వాలిపోయి.. చెప్పే కబుర్లు శ్రద్ధగా వింటున్నాడంటే.. ప్రేమిస్తున్నాడన్నమాటే... తన లవర్‌ ఆరోగ్యం బాలేదని తెలిసికూడా.. అక్కడున్నాను.. ఇక్కడున్నాను... అంటూ సాకులు చెప్తే.. అది లవ్‌ కాదు.. ఇంట్రస్ట్‌ అనే అర్థం చేసుకోవాలి. అర్థరాత్రి నిద్రలేపి అడిగినా.. అమ్మాయి ఇష్టాలు గడగడా చెప్తూ... సందు దొరికితే మాటలు... సమయం కుదిరితే ఎస్‌ఎమ్మెస్‌లు పంపుతుంటే అబ్బాయిగారు పూర్తిగా ప్రేమలో మునిగినట్టే... తను ఇష్టపడిన అమ్మాయి కళ్లల్లోకి చూస్తూ సిగ్గుల మొగ్గై మొలికలు తిరుగుతున్నాడో.. కచ్చితంగా అతగాడు ఆ అమ్మాయికి దాసుడైపోయినట్టే... ఇలా కాకుండా... అమ్మాయి తమ ఫ్యూచర్‌కోసం మాట్లాడుతున్నప్పుడు.. విషయాన్ని పక్కదారి పట్టిస్తూ.. వేరే టాపిక్‌ మాట్లాడుతున్నాడా..? అబ్బాయి గారిని కాస్తం అనుమానించాల్సిందే... ఇక అమ్మాయి విషయానికొస్తే.. పదే పదే తాకుతూ, అవసరం ఉన్నా, లేకున్నా.. షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ అబ్బాయిగారిని షేక్‌ చేస్తుందంటే.. దగ్గర కావలనుకుంటున్నట్టే... అలాకాకుండా.. ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్లు పట్టించుకోకుండా ఉంటే అబ్బాయిగారి లవ్‌ అటకెక్కినట్టే... ప్రతి చిన్నపనికి కేర్‌ తీస్కోమంటూ... కేకలు పెడుతూ ఇలా చెయ్‌... అలా చెయ్‌ అని సతాయిస్తూ.. అబ్బాయిగారి పేరెంట్స్‌ను అత్తమ్మా, మావయ్యా , అంటూ వరుసలు కలిపిందా... ఇక ఆయన గారికి మొగుడు హోదా కల్పించినట్టే....మనసులో గూడు కట్టుకున్న ప్రేమభావాన్ని నచ్చిన వారికి చెప్పాలంటే బోలెడు రాచబాటలు, కవితలల్లి కన్నెపిల్ల మనసు కొల్లగొట్టే కవిత్రేసరులు కొందరైతే.. ఖరీదైన కానుకలిచ్చి ప్రేమికులు కనుపాపల్లో కొలువయ్యే కాస్ట్‌లీ లవర్స్‌ ఇంకొందరు. ప్రేమికులు ఎవరైనా.. వారి ప్రేమలో నిజాయితీ ఎంతుందనేదే ఇంపార్టెంట్‌... సో.. ఎంచుకోండి నిజమైన ప్రేమను... దరిచేరనివ్వకండి కవ్వించే ఆకర్షణను.
---------------------------------
ప్రేమ లేఖ రాశా.. నీకు అంది ఉంట‌ది...

ప్రేమ లేఖ రాయాలంటే కావ‌ల్సిన అర్హత‌లు ఎన్నో తెలీదు కానీ, గుండె నిండా ప్రేమ‌, గుప్పెట్లో స్పంద‌న ఉంటే చాలు. గుండెంత ప్రేమ‌ను పుక్కిట పట్టి ఒక్క చోట పెడితే అది మ‌న‌సు వేద‌న అవుతుంది. చ‌క్కనైన‌, చిక్కటి ప్రేమ లేఖ అవుతుంది. ప్రేమ లేఖ లో ఉండేవి నాలుగు మాట‌లైనా, న‌ల‌భై వాక్యాలైనా.. దాని నిండా ఉండాల్సింది ప్రేమ మాత్రమే.
ప్రేమ లేఖ - మొద‌టి పేరా లోగుప్పెడు మ‌న‌సుని విప్పద్దు సుమా. ఎదుటి వారిపై పొంగుతున్న ప్రేమ‌ను దోసిట ప‌ట్టి.. ఒక్క చోట చేర్చి చిక్కనైన ప‌దాల‌తో అక్షరాల్లో తీర్చిదిద్దాలి. ఇందులో అతిశ‌యోక్తులు వ‌ద్దే వ‌ద్దు. ముక్కు సూటిగా మాట్లాడుతూ ,, పొందికైన మాట‌ల‌తో సున్నితంగా భావాల్ని, స్పంద‌న‌ల్ని త‌ట్టి లేపాలి. సాధ్యమైనంత వ‌ర‌కు ప్రకృతి లోని అందాల్ని, అల‌వోక‌గా ప్రస్తావిస్తూ క‌మ్మని క‌విత‌ల్ని కాస్తంత స్పృశిస్తే మేలు. అందాల‌కు, అంద‌మైన భావాలకు ఉండే గొప్ప త‌నాన్ని కొద్ది కొద్ది గాప్రస్తావించ‌టం మేలు. పేరా చివ‌ర్లో మాత్రం.. ఈ అంద‌మైన అనుభూతుల్ని ఎదుటి వార‌ని క‌లుపుతూ ఆపాలి.

రెండో పేరాలో ఎదుటి వారితో మ‌న‌కు ఉన్న భావాల్ని షేర్ చేసుకోవ‌చ్చు. ఇక్కడ ఫియాన్సీ ఫీలింగ్స్ ను, వాటిలో మ‌న‌కు న‌చ్చిన అంశాలు, క‌ట్టి ప‌డేసే విష‌యాల్ని నిజాయితీ గా బ‌య‌ట పెట్టాలి. కావాల‌ని క‌ల్పిత‌పు క‌బుర్లు, బడాయిత‌నం వ‌ద్దు సుమీ. ఈ మ‌ధ్య కాలంలో చోటు చేసుకొన్న వి ట‌చ్ చేయ‌చ్చు. డ్రెస్ గురించి, డిజైన్స్ గురించి, పెన్నులు, పిన్నులు వంటి వాటి గురించి రాయ‌చ్చు. ఆ వ‌స్తువుల్ని మ‌నం ఫాలో అవుతున్నట్లయితే ఆ ఫీలింగ్స్ రాయ‌చ్చు. ఎంత చెప్పామ‌నే దానికంటే ఎలా చెప్పామ‌నే దానికే ఇక్కడ ప్రాధాన్యం ఉంటుంది.

మూడో పేరాలో మ‌నం చెప్పద‌ల‌చుకొన్నది సుత్తి లేకుండా సూటిగా చెప్పేయ‌ట‌మే. కొత్త గా ప్రేమ‌ను వ్యక్తీక‌రించేట‌ప్పుడు ఉన్న విష‌యాన్ని ఉన్నట్లుగానే చెప్పేయ‌టం మేలు. ఎందుచేత అభిమానిస్తున్నదీ, ఎందుచేత ఇష్టప‌డుతున్నదీ నిజాయితీ గా బ‌య‌ట పెట్టుకోవాలి. ఎక్కడా అతిశ‌యోక్తులు, ఓవ‌ర్ కోటింగ్‌లు వ‌ద్దు. ఆల్ రెడీ ప్రేమ‌లో మునిగితే మాత్రం ప్రస్తుత టెంప‌రేచ‌ర్ నోట్ చేయాలి. ఇవ్వాల్టి విశేషాలు, కొ్త్త స‌మ్ గ‌తులు గ‌మ్మతుగా రాసుకోవ‌చ్చు. బ‌య‌ట ప్రోగ్రామ్స్ పెట్టుకొంటే త‌మాషాగా వాటిని వ‌ర్ణించ‌వ‌చ్చు. ప్రేమను గుర్తు చేసే ఈవెంట్స్ ను ప్రస్తావించ‌వ‌చ్చు.
చివ‌రి పేరాలో ముగింపు వాక్యాలు ఉండాలి. గుర్తు పెట్టుకొంటున్న విష‌యాన్ని ప‌దే ప‌దే ప్రస్తావించాలి. ఏ పని లో ఉన్నా, ఎక్క డ ఉన్నా ప్రేమ ను త‌ల‌చుకొంటున్న విష‌యాన్ని గుర్తు చేయాలి. ప్రేమ కు ఉన్న బ‌ల‌మే త‌న బ‌లం అన్న విష‌యాన్ని రుజువు చేయాలి. ఏదైనా ప్రేమ‌కు సంబంధించిన కొటేష‌న్ త‌గిలించుకోవ‌చ్చు. మ‌న‌సు పొర‌ల్ని సున్నితంగా క‌ప్పుకొంటూ లేఖ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయాలి. ప్రేమ లేఖ లో ఎత్తు గ‌డ‌, ముగింపు .. రెండూ ముఖ్యమే. అందుకే అంతే చిక్కటి ముగింపు తో ప్రేమ లేఖ‌ను పూర్తి చేయ‌వ‌చ్చు.
సో, ప్రేమ లేఖ రాయటంలో ఇది ఒక బేసిక్ స్టయిల్ మాత్రమే. నిండా మునిగిన వారు ఇంకా అద్భుతంగా రాసేయ‌గ‌ల‌రు. ప్రేమ లేఖ‌ను రాయ‌టం క‌న్నా చెక్కటం అంటే మంచిదేమో. శిల్పం చెక్కినంత శ్రద్ధ గా దీన్ని పంపిస్తారు కాబ‌ట్టి..

0 comments:

Post a Comment