రచన : వై. శ్రీరాములు
(9వ ఆటా మహాసభల కవితల పోటీ లో రూ. 4000 పారితోషికం అందుకున్న కవిత)
ఆకాశంలోకి ఎడారి ప్రాకింది
చెట్లకేకాదు, పుట్లకేకాదు
అనంతపురంలో భూమికే చెదలు పట్టింది
నింగిలో ఎక్కడా నీడజాడలేని సముద్రుని పాదముద్ర
శూన్యాకాశ ఎడారి విస్తరిలో
ఏ దిక్కునా కానరాని చిటికెడు ఉప్పు మేఘం
గగనమంతా ఎలుకలు పారాడే ఆకలి కడుపుతో నిండిన
చీకటి గుహ
నింగినేల ఏకమై మమేకమై భోరున కురుస్తున్న ఎండ
మేఫూల నీడ సోకక
ఈ మట్టి మరిచింది పుట్టుక
విత్తిన విత్తనం మొలకెత్తక
రైతు గొంతులోకి జారిన విషపు గుళిక
కానీ … కాసిన్ని నీళ్ళను చిల్లిగవ్వలో నింపి ఇవ్వలేక
రాళ్ళను ఇసుకతో కలిపి తింటున్న రాజకీయ వర్ణకారులు
ప్రజల దాహానికి గాజు గ్లాసులతో నిర్మిస్తున్న ఆనకట్టలు
ఎండమావుల్లో నీళ్ళు చూపించి కన్నీళ్ళు తెప్పించే నేర్పరులు
ప్రతి ప్రభుత్వం ఓ సాలె పురుగే!
అందమైన జలతారు పలుకుల తీగలతో
అయదేళ్ళకోసారి అల్లిన వలలోకి వెళితే చాలు
అప్పుల నిప్పులు చేతితో తాకితే చాలు
మొనోక్రోటోఫాస్ ఉచితం … ఎందుకో తెలుసా!
నేలపై పైరుకు చీడ వదిలించడానికి కాదు
నేలలోకి పెరగని విత్తనంలా రైతును దించడానికి
రేపు మళ్ళీ వాడి కడుపును వాడి నాగలితోనే కోయడానికి
ఇక ఇక్కడ చరిత్ర పుటల్లోని ప్రతి అక్షరం
రైతుల సమాధుల ఫలకాలపై మండే భాస్వరం.
పిల్లల్ని అనాథల్ని చేస్తూ
పెద్దల్ని చావు దీవిస్తుంటుంది ఎల్లప్పుడు.
మొన్న రతనాల సీమ
నిన్న రాళ్ళసీమ
నేడు భస్మసీమ
రేపు చితాభస్మసీమ
ఇక్కడ ప్రతి ప్రభాతం ఓ భూతం
ఏ వార్తను ఎలా తెస్తుందో
తనకే తెలియని చీకటి గీతం.
ఉరితాళ్ళకు వ్రేలాడే నూలుపేగుల ఆకలి పేగులు
ఉదయం దినపత్రికలో నల్లగా మారిన అక్షరాలు
కూడు గుడ్డ ఇచ్చే వారి
రక్తం మరకలతో నిండిన ప్రతి దినపత్రిక
మా రాయలసీమ ప్రతిరోజూ పాడుకునే
ఆకలి చావుల అత్యున్నత జాతీయ గీతిక
Tuesday, April 26, 2011
Saturday, April 23, 2011
నాన్న
(9వ ఆటా మహాసభల కవితల పోటీ లో రూ. 4000 పారితోషికం అందుకున్న కవిత)
ఎప్పుడూ
గుండెల మీద రెండు కలువపూల పాదాలు
కదలాడుతున్నట్టుగానే వుంటుంది
రెండు వెన్నపూస పెదాలు
నా బుగ్గల్ని ఎంగిలిచేసి నవ్వుతున్నట్టే ఉంటుంది.
రెండు తమలపాకు చేతులు
నా మెడని సుతారంగా చుట్టుకుని
ఉయ్యాల లూగుతున్నట్టే అనిపిస్తుంది.
చెడ్డీల నుండి చమ్కీల చుడీదార్ల దాక
పప్పీ షేముల నుండి పట్టు పావడాల దాకా
అదెన్ని వేషాలు మార్చినా
ఈ నాన్న కన్నుల్లో తానింకా కుందేలు పిల్లే
ఈ తండ్రి గుండెల్లో తానింకా మంచుపూలజల్లే.
పిల్లల్లో పిల్లలా, అమ్మాయిల్లో అమ్మాయిలా కనిపిస్తూ
నన్ను లక్షల కూతుళ్ళున్న లక్షాధికారిని చేసేస్తుంది.
ఏ షాపుకైనా వెళతానా
అక్కడ బొమ్మలన్నీ నా చిట్టితల్లిలా
నాన్నా నాన్నా అని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది.
అలా దారిలో కాన్వెంటు పిల్లల్ని చూస్తానా
అనేక రూపాల్లో మా అమ్మాయే ఆడుకుంటున్నట్టు ఉంటుంది.
ఏ కాలేజీ దగ్గర నిలబడ్డా
రంగు రంగుల దుస్తుల్లో మా పిల్లే
తూనీగలా ఎగురుతున్నట్టు ఉంటుంది
క్రిక్కిరిసిన ఏ బజారులో నిలుచున్నా
నేనూ నా కూతురూ వందల వేల రూపాల్లో విడిపోయి
చెట్టా పట్టాలు వేసుకు తిరుగుతున్నట్టే అనిపిస్తుంది.
ఎవరికీ కనబడదు గాని
నా నెత్తిమీద ఓ బుల్లి సింహాసనం - దానిలో నా బుజ్జి యువరాణి.
ఈ ప్రపంచం తిరునాళ్ళలో తనను అలా అలుపులేకుండా తిప్పుతున్నట్టే ఉంటుంది.
దానికిప్పుడు అద్దంలో తన బొమ్మ తప్ప
ఏమీ పట్టదు గాని
అది రాత్రంతా పడీ పడీ చదువుతుంటే
నేను టీ డికాక్షన్‌లా మరుగుతూనే ఉంటాను
అది పరీక్షలు రాస్తుంటే
ఆ మూడు గంటలూ రోడ్డు మీద వాహనాలేవీ కదలొద్దని
కసురుకునే ట్రాఫిక్ పోలీసునై పోతాను.
తను చలితో వణికిపోతే
నేను పత్తికాయనై పగిలిపోతాను
తను జ్వరంతో మండిపోతే
వంద రెక్కల విసనకర్రనై తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను
తను జబ్బు పడితే మొత్తం వైద్యశాస్త్రాన్నే తప్పుపడతాను.
ఒక్కసారి నవ్విందా
ఒళ్ళంతా వేల పియానోలు చుట్టుకొని
సజల సంగీతమై ద్రవించిపోతాను.
ఇంక తన పుట్టినరోజు వచ్చిందంటే
ఆకాశానికి నేనే బెలూనై వేలాడతాను.
కొమ్మకొమ్మకీ చాక్లెట్లూ, కేకులూ వేలాడదీసి
పక్షులకు ఫలహారంగా పెడతాను.
ఇప్పుడు తను పెద్దదయ్యింది కదా
నాన్న బొజ్జతో ఆడుకోవడం ఎప్పుడో మానేసింది
పైగా నన్ను చూసి
‘పిచ్చి నాన్న’ అంటూ నవ్వేస్తుంది.
అదేమిటో గాని ఎప్పుడూ
కోతిపిల్ల తల్లిపొట్ట కరచుకు పట్టుకున్నట్టు
ఒక సుతిమెత్తని ప్రాణగీతమేదో
నా పొట్టను పెనవేసుకున్నట్టే ఉంటుంది.
నాకు మాత్రం కూతురంటే
ఒకే జన్మలో మనం పొందే రెండో అమ్మ
మన గుండె షోకేసుల్లో నిత్యం నవ్వే మురిపాల బొమ్మ.

Thursday, April 21, 2011
అమ్మ గురించి ఆలోచించండి...
|
కరణేషు మంత్రి
భోజ్యేషు మాతా
శయనేషు రంభ…
ఇలా ఉండాలని ప్రతి అమ్మాయికి నేర్పిస్తారు. ప్రతి ఆడపిల్ల పెళ్ళికాకముందు హాయిగా చీకూ చింతా లేకుండా, చదువు , స్నేహితులతో సరదాగా ఉంటుంది. కాని పెళ్ళి కాగానే అమ్మలా మారుతుంది. లేదా మారడానికి ప్రయత్నం మొదలు పెడుతుంది. ఒక కుటుంబాన్ని తనదిగా భావించి మరో తరాన్ని సృష్టించి, ముందుకు నడిపించే పెద్దరికం నెత్తిన వేసుకుంటుంది స్త్రీ. అత్తవారింటికొచ్చాక ఆమెపై కొత్తగా ఆంక్షలను విధించడం కూడా జరుగుతుంటుంది. ఐనా అనుభవం మీద ఒక్కటొక్కటిగా భర్త సహకారంతో నేర్చుకుంటుంది.
అత్తమామలకు, భర్త, పిల్లలకు కావలసినవి అమర్చి పెట్టడం, బంధువులతో మర్యాదగా ఉండడం... ఇలా ఎన్నో బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చడంకోసం సతమతమవుతుంది. ఇంత శ్రమ పడుతున్న అమ్మకు కొన్ని కోరికలు, ఆశలు ఉంటాయని ఎవరైనా ఆలోచిస్తారా? చిన్న చిన్న కోరికలను సైతం తీర్చుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో అమ్మలుంటున్నారనడానికి ఈ చిన్ని ఉదాహరణ చాలు. తమ కాలనీలో చీరలమ్మేవాడు వస్తే... ఉద్యోగిణులు మాత్రం స్వతంత్రించి చీరలు కొనుక్కోగలరు. తను ఉద్యోగం చేయట్లేదు... కనుక ఆమె కొనలేని దయనీయ పరిస్థితి
ఆమె అనుకుంటే... ఇంటి ఖర్చులకోసం భర్త ఇచ్చిన డబ్బుల నుంచి కొనుక్కోవచ్చు. కాని అది తన స్వంతం కాదు. ఖర్చు చేస్తే దానికి లెక్క చెప్పాలి. లేదా భర్తను అడగాలి. అందరికి అన్నీ అమర్చి పెడుతున్నా... తనకంటూ స్వంత డబ్బుఉండదు. ఖర్చు పెట్టాలనుకున్న డబ్బు... భర్తదో, కొడుకుదో, కూతురిదో అవుతుంది. వాళ్ళు ఇస్తేనే తప్ప తనకిష్టమైనవి కొనుక్కోలేని స్థితి. ఇంటి పనులన్నీ చేసి ఉద్యోగం కూడా చేయాలంటే కష్టం.
| |
| |
పెళ్ళై , పిల్లలు... వాళ్ళ పెంపకం, చదువులు,ఉద్యోగాలు, వారి పెళ్ళిల్లు... ఇలా బాధ్యతలు పెరుతూనే ఉంటాయి. ఈ పరిణామంలో తన ఉనికినే కోల్పోతుంది స్త్రీ. తనకు ఏది ఇష్టం, ఏది తనకు నిజమైన సంతృప్తినిస్తుంది అనే విషయాల గురించి ఆలోచించే అవకాశం ఎక్కడ దొరుకుతుంది. ఎప్పుడూ భర్తకు కావల్సినవి, పిల్లలకునచ్చినవి చేయడం అనే ఆలోచనలే.
ఈరోజుల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, కుట్లు అల్లికలు మొదలైనవి చేసి తమకంటూ ఆదాయం ఏర్పరచుకుంటున్నారు. కాని అవి కుటుంబ నిర్వహణకు, పిల్లల ఖర్చులకు సరిపోతున్నాయి. సరేలే భార్య ఎంత కష్టపడినా కుటుంబ ఆదాయానికే కదా అని భర్తలు ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనూ ఆమె తన కుటుంబ నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఊరుకోరు. తమను దాటి పోనివ్వరు భర్తలు.
|
నిజంగా అమ్మ చేసే పనులన్నీ మీరు చేయగలరా? ఇక్కడ అమ్మ అంటే ఇంటి ఇల్లాలు. ఒక్కసారి.... కనీసం మూడు రోజులు అమ్మ స్థానంలోకి వెళ్ళి ఆమె చేసే పనులన్నీ మీరు చేయగలరా ప్రయత్నించి చూడండి. అలాగే ఉద్యోగం చేస్తూ, ఇంటిపనులనూ సమర్ధవంతంగా చేసే మహిళల్లా మగవారూ ఆ పనిని చేయగలరేమో ప్రయత్నించి చూడండి.
సాధ్యం కాదు కదూ... మరి అలాంటప్పుడు స్త్రీని ఎందుకు లోకువగా చూస్తారు? అంటే భార్య(అమ్మ ) ఉన్నది ఇంటిపని చేయడానికేనా. పెళ్ళి అయినప్పటినుండి కుటుంబంకోసం ఎంతో కష్టపడుతుంది కదా... అని ఒక్కసారైనా ఆలోచించారా? కేవలం ఆమె ఉన్నది ఇంటి పనులు చేయడానికే అని అనుకుంటున్నారా?
ఒక్కసారైనా అమ్మకు ఏదంటే ఇష్టం. ఏ స్వీటు అంటే చాలా ఇష్టం. ఏ పుస్తకం చదవాలనుకుంటుందో, ఏదైనా నేర్చుకోవాలనుకుని మానేసిందో... ఇత్యాది విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నించారా...? ఆడది కదా ఓ చీరో, ఓ నగో ఇస్తే సంతోషిస్తుందిలే అనుకుంటారు కదా. కాని వాటికంటే ఆమెకు చాలా ఇష్టమైనది ఏదో ఉండే ఉంటుంది.
అదేదో కనుక్కుని చేయగలిగితే (డబ్బులు ఇవ్వకున్నా) ఆమెకు నిజమైన సంతృప్తి కలుగుతుందేమో. ఇప్పటికైనా కనుక్కోండి. ఆమెను ప్రోత్సహించండి. భార్యగా... తల్లిగా తన బాధ్యతలతో పాటు తనకంటూ ఒక జీవితం , ఒక లక్ష్యం సృష్టించుకోనివ్వండి. అప్పుడే ఆమెకు నిజమైన ఆనందం.
నేటి తరానికీ ఈ టపా నచ్చకపోవచ్చు. ఇది నా తరానికి, నా ముందు తరానికి చెందిన అమ్మలకు చెందిన వాస్తవాలు. ఇలాంటి ప్రాణమిచ్చే అమ్మలు ఎందరికో ఉన్నారు. లేదనుకునేవారు కోట్లున్నా బిచ్చగాళ్లకిందే లెక్క. ఉన్నవారు పైసా లేకున్నా కోటీశ్వరులే.
బాబా బందీ
బాబా బందీ
చెర పట్టిన సహాయకులు
మానసిక వేదనలో భగవాన్
మూడు నెలలుగా అన్నం లేదు
ఆరు నెలలుగా మాట్లాడింది లేదు
'భగవాన్'కు గంజిలో నిద్రమాత్రలు
ఆప్తులనూ రానివ్వని సహాయకులు
తనువు చాలించాలన్న వ్యథతో బాబా!
చికిత్స ఒకటి.. చెబుతున్నది మరోటి
ఐసీయూలో వైద్యం తెలియని వ్యక్తి
ఎముకల గూడులో సత్యసాయి
అందుకే బయటికి రాని ఫోటోలు?
ఆయన పాద పద్మాలను ఫొటోల్లో చూసుకుని సైతం తన్మయత్వానికి గురయ్యే అఖిల భక్త జనానికి ఇదో చేదు నిజం... మూడు నెలలుగా 'ప్రత్యక్ష దైవానికి' ప్రత్యక్ష నరకం! ముప్పూటలా పంచభక్ష్యాలు ఆరగిస్తున్న 'జిత్తు'ల మారి సహాయకులు.. మూడు నెలలుగా 'దివ్య పురుషుడికి' ఒక్క ముద్ద అన్నం పెట్టని దైన్యం! గంజిలో నిద్ర మాత్రలు వేసి.. 'దేవుడిని' నిద్రలో ముంచేసిన చిత్రం!
నిత్యం భక్తితత్వం ప్రబోధించే 'భగవాన్'.. ఆరు నెలలుగా బలవంతపు మూగ నోములో బందీ అయిన వైచిత్రి! సత్యజిత్ అనే సహాయకుడి చేతుల్లో సత్యసాయిబాబా బందీ! అసలు ఆయన అనారోగ్యానికి కారణం కూడా ఈ సత్యజిత్తే! ఇది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పరిశోధనలో వెల్లడైన పచ్చి నిజం! సహాయకుల ముసుగులో బాబాను చెరపట్టిన వైనం ఎప్పటికైనా భక్తులకు తెలియాలనే ఉద్దేశంతో ప్రశాంతి నిలయంలో 1968 నుంచి ఉంటున్న ప్రొ. శ్యాంసుందర్ రాసి పెట్టుకున్న ఒక లేఖను ఆంధ్రజ్యోతి సంపాదించింది.
అవును.. ప్రశాంతి నిలయం.. ఇప్పుడు అశాంతి నిలయమైంది! ప్రేమ భావనలు బోధించిన వేద మూర్తికి.. అది మానసిక వేదన మిగిల్చింది! భక్తితత్వం బోధించిన కాషాయధారికి.. కపట శిష్యగణం ఖైదు విధించింది!! అసలు.. సత్యజిత్ అనే అల్ప జీవి.. సాక్షాత్తూ సత్యసాయినే తన గుప్పిట్లోకి ఎలా తీసుకున్నాడు? దీని వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి?
శ్యాం సుందర్ లేఖలో ఏముందంటే?
...బాబా అందరికీ దేవుడు కావచ్చేమో కానీ తనకు, సత్యజిత్‌కు మాత్రం దేవుడు కాడని శౌరి తరచు అనేవారు. ...ఈ దశలో శౌరి సత్యజిత్‌కు ఒక సలహా ఇచ్చారు. బాబాకు ప్రతిరోజూ రాత్రి నిద్రమాత్రలు ఇచ్చి పడుకోబెట్టేయమని! అప్పట్నుంచి బాబాకు నిద్రమాత్రలు వేయడం మొదలైంది.
...2006లో భగవాన్ బృందావన్ నుంచి తిరిగి వచ్చారు. ఇకపై నిద్ర మాత్రలు వేసుకోనని చెప్పారు. అయితే ప్రశాంతి నిలయం చేరుకున్నాక నిద్రమాత్రలు వేసుకోవడం ప్రారంభించారు. కాలం గడిచేకొద్దీ బాబా కదలికలు మందగించాయి.
...సత్యజిత్ చెప్పేవరకూ ఏ డాక్టరూ బాబా దగ్గరకు రావడానికి వీల్లేదు. స్వామి ఏ సమయంలో దర్శనం ఇవ్వాలో నిర్ణయించేది సత్యజితే. కిందకు తీసుకురావాలా, వద్దా అనేది కూడా ఆయన ఇష్టమే.
...ప్రతి శనివారం లేదా ఆదివారం లేదా సెలవు రోజు ఇద్దరు డాక్టర్లు వచ్చి యజుర్మందిర్‌లో ఉంటారు. కానీ వారు వచ్చేది వైద్యం చేయడానికి కాదు... అర్ధరాత్రి వరకూ సినిమాలు చూస్తూ గడపడానికి.
...గత ఆరు నెలల నుంచీ స్వామి ముఖ పక్షవాతంతో బాధపడడం చూస్తున్నాను. ఆ విషయంలో ఎవరైనా ఏమైనా చేశారా? దాని గురించి ఎవరూ మాట్లాడరు. వారికి ఆ అధికారం లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే సత్యజిత్‌కు భయపడి కావచ్చు.
...భగవాన్ గుండె జబ్బుతో బాధపడుతున్నారనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం. ఆ సమస్య కొద్ది రోజుల కిందటే ఏర్పడిందా? లేదంటే చాలా నెలల క్రితం నుంచే ఉందా? చాలా నెలల క్రితం నుంచే ఉందని వైద్య పరీక్షల నివేదికలు చెబుతున్నప్పుడు మరి చికిత్సను ముందుగానే ఎందుకు ప్రారంభించలేదు?
ఇప్పుడైనా నేను నోరు విప్పకపోతే దేవుడు క్షమాంచడు: ఆదికేశవులు
బాబాను నేను కలిసిన సమయంలో ఆయనలో వైరాగ్యం కనిపించింది. కొన్ని రోజులుగా ఆయన మనసు విప్పి మాట్లాడడం లేదు. మూడు నెలలుగా అన్నం ముట్టడం లేదని తెలిసింది. ఈ స్థాయిలో ఆరోగ్యం క్షీణించే దశకు చేరడం వెనుక ట్రస్టు నిర్లక్ష్యం ఉంది. ఈ స్థితిలో కూడా నేను నోరు విప్పి మాట్లాడకపోతే దేవుడు కూడా నన్ను క్షమించడు. అక్కడ చాలా జరుగుతోంది.
స్వామి చిత్ర వధ కంటే ఎక్కువ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. హెల్త్ బులెటిన్‌ను సైతం ట్రస్టు, ప్రభుత్వ వైద్యులు వేరు వేరుగా ఇస్తున్నారు. లక్షలాది భక్తులు ఆరాధించే దివ్య పురుషుడైన బాబాకు ఈ పరిస్థితి రావడం బాధాకరం. దురదృష్టకరం. ప్రస్తుత పరిస్థితి నన్ను వేధిస్తోంది. దీనిని సహించేది లేదు. సత్యజిత్‌ను విచారించాలి. బాబా ఆరోగ్యం బాగుపడాలి. త్వరలో ఆయన భక్తులకు దివ్యదర్శనం ఇవ్వాలి.
- బాబా భక్తుడు ఆదికేశవులు నాయుడు
హైదరాబాద్, ఏప్రిల్ 14 : కోట్లాది భక్తులకు ప్రత్యక్ష దైవం కొంత కాలంగా ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారా? ఏకుల్లా వచ్చి మేకులైన వారు బాబాను గుప్పిట్లో పెట్టుకొని, నిర్బంధించి, సకాలంలో సరైన వైద్యం అందకుండా చేశారా? ఆస్పత్రిలో చేర్చక ముందు రోజూ బాబా గదికి తాళం వేసి, ఆయనను తీవ్ర మనోవేదనకు, ఆనారోగ్యానికి గురి చేసిన వ్యక్తి.. ఇప్పుడు బాబా చికిత్స పొందుతున్న ఐసీయూలో ఏం చేస్తున్నట్లు?
ప్రభుత్వం పంపిన డాక్టర్లను కాదని, ఇతరులు బాబాకు చేస్తున్న చికిత్స ఏమిటి? బాబాకు గత కొన్ని నెలలుగా వాడిన మందులు ఏంటి? అవి సరైన చికిత్స కోసం వాడినవేనా? వీటన్నింటికీ సమాధానం దొరికితే ప్రశాంతి నిలయంలో సాగుతున్న అశాంతి కార్యకలాపాలు బట్టబయలవుతాయి! వీటిలో కొన్నింటికి 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' కూపీ లాగింది. విస్తుబోయే విషయాలను బయటకు తీసింది. భక్త కోటి నిర్ఘాంతపోయే నిశీధి నిజాలను తవ్వితీసింది.
బాబాకు సరైన వైద్య చికిత్స అందించాలని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి, బాబాకు సన్నిహితులైన టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు వంటివారు ఆరు నెలల కిందటే ఎంత మొత్తుకున్నా.. పరిస్థితి విషమించే వరకు ఉపేక్షించి, బాబాను తీవ్ర ప్రాణాపాయ స్థితిలోకి నెట్టివేశారు. బాబా తొమ్మిదేళ్ల కిందట ప్రమాదవశాత్తూ కింద పడ్డారు. ఆ ఘటనలో ఆయన తుంటి ఎముక దెబ్బతింది.
అప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఆయనకు సపర్యలు చేసే బాధ్యతలు స్వీకరించిన సత్యజిత్ అనే వ్యక్తి ఇపుడు మొత్తం కథ నడిపిస్తున్నారు. 2005 నుంచి బాబాను దాదాపుగా బందీ చేశారు. మొదట్లో ఉన్న పూర్ణచంద్ర హాలు నుంచి యజుర్మందిరంలోకి బాబాను మార్చారు. బాబాను ఎవరూ దర్శించుకోవడానికి వీలు లేకుండా గేట్లకు తాళాలు వేసేవారని తెలియవచ్చింది.
సత్యజిత్ నిర్లక్ష్యం వల్లే!
బాబాకు ఆహారం అందించడంతో పాటు అనేక విషయాల్లో సత్యజిత్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్న ఆరోపణ వినిపిస్తోంది. బాబాకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నా సత్యజిత్ అనుమతి ఉండాలన్న రీతిలో వ్యవహారం నడిచినట్టు చెబుతున్నారు. సాయి వ్యవహారాలతో పాటు ఆయన ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ట్రస్ట్ వర్గాలు ఆధిపత్య పోరులో మునిగిపోవడం కూడా బాబా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యానికి కారణమయ్యాయన్న అనుమానాలున్నాయి.
సత్యజిత్ వ్యవహారం కారణంగానే సత్యసాయి నేడు అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్న వాదన వినిపిస్తోంది. ప్రధానంగా సెంట్రల్ ట్రస్ట్‌లో సభ్యత్వం కావాలని సత్యజిత్ గతంలో డిమాండ్ చేసినట్టు కూడా ఆరోపణలున్నాయి.
సెంట్రల్ ట్రస్ట్‌లో సభ్యత్వం విషయంలో ఇతరులు సత్యజిత్‌ను అడ్డుకున్నట్టు ప్రచారముంది. సాయి ఆరోగ్యం విషయంలో మొదటి నుంచి ఉన్న వారిపై కూడా సత్యజిత్ తన ఆధిపత్యం ప్రదర్శించి ఒక్కొక్కరినీ దూరం చేస్తూ వచ్చారని శ్యాంసుందర్ అనే ప్రొఫెసర్ పేర్కొనడం గమనార్హం. ఇలా ఎవరికి వారు సత్యసాయిపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చి ఆయనను మానసికంగా తీవ్ర క్షోభకు గురి చేసినట్టు ప్రచారముంది.
వైద్య బృందం కోసం పట్టుబట్టిన ఆంతరంగికులు!
అడపాదడపా బాబానే బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చి వెళ్లేవారు. బాబా ఆరోగ్య పరిస్థితి క్రమేపీ దెబ్బ తింటున్నట్లు గుర్తించిన ట్రస్టు సభ్యులు, ఆంతరంగికులు, ఆయన చికిత్సను పర్యవేక్షించేందుకు ఒక వైద్యుల కమిటీని నియమించాలని సూచించారు. మంత్రి గీతారెడ్డి కూడా పట్టుపట్టారు కానీ ఏ కారణాల వల్లనో అది ఆచరణలోకి రాలేదు.
గత మూడు నెలలుగా బాబా ఆరోగ్య పరిస్థితిలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. తీవ్రమైన మనోవేదనను, వైరాగ్యాన్ని తన సన్నిహితుల వద్ద వ్యక్తపరిచేవారు. భక్తులకు దర్శనం ఇవ్వడం కూడా తగ్గించేశారు. తన ఆశయం సిద్ధించిందని తనువు చాలిస్తానని కూడా ఆంతరంగికుల వద్ద అనేవారు. దాదాపు మూడు నెలలు మానసికంగా, శారీరకంగాతీవ్ర మనోవేదనను, హింసను అనుభవించారు. ఆయనకు అన్నం పెట్టకుండా కేవలం గంజిలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చేవారని తెలుస్తోంది.
పరిస్థితి చేజారి పోతున్న సమయంలో మార్చి 28న బాబాను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్చి 27న బాబా ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఆయన ఆప్తులకు దిగ్భ్రాంతికర విషయం తెలిసింది. 27వ తేదీన బాబా ఉన్న గదితో పాటు లిఫ్టుకు సైతం తాళాలు వేశారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న బాబాను ఆస్పత్రికి పంపకుండా, సన్నిహితులకు చూపకుండా తాళాలు ఎందుకు వేశారు? ఎవరికీ అంతుపట్టదు! ఇది గడచిన చరిత్ర! బాబాకు జరుగుతున్న వైద్యమేంటి?
మార్చి 28 తర్వాత ఆస్పత్రిలో జరుగుతున్నదేమిటి! ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న! బాబాకు ఒట్టి అనారోగ్యమేనా? ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతిన్నాయని, ఇన్ఫెక్షన్ క్రమేపీ తగ్గుతోందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. మరి బాబాకు సీటీ స్కాన్ చేసిన విషయాన్ని మాత్రం బయటకు చెప్పడం లేదు. ఐసీయులోకి ప్రభుత్వ వైద్యుల బృందాన్ని అనుమతించడంలేదు.
బాబాకు గత కొన్ని నెలలుగా వాడిన మందుల వివరాలన్నీ వైద్య విభాగం డైరెక్టర్ రవిరాజ్ దగ్గర ఉన్నాయి. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి... గొడవల చెలరేగుతాయి.. అనే భావంతో ఆ విషయాలను బయటపెట్టడం లేదు. లోపలి అవయవాలతో పాటు శరీరంపైన కూడా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అన్నది వైద్యులు తేల్చాల్సి ఉంది. అదే సమయంలో చికిత్స పొందుతున్న బాబాను ఎందుకు చూపించడం లేదన్నది మరో ప్రశ్న. తీవ్ర అనారోగ్యానికి గురైన బాబా.. ఎముకల గూడుగా మారిపోయారని, అందుకే ఆయన వీడియో క్లిప్పింగ్‌ను గానీ, కనీసం ఫొటోను గానీ బయటికి రానీయడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఆస్పత్రిలో వైద్యుల కంటే వైద్యం తెలియనివారే ఎక్కువగా ఉండటం విశేషం. ఐసీయూను తన కంట్రోల్‌లో ఉంచుకున్న కార్డియాలజిస్ట్ అయ్యర్ కూడా ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్నారని తెలుస్తోంది. సాధారణంగా ఐసీయూలో ఉన్న పేషెంట్‌ను అత్యవసరమైతే గానీ కదపరు. అటువంటిది... సత్యసాయిని పిల్లి.. పిల్లలను మార్చినట్లు ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్‌కు తెగ తిప్పేస్తున్నారు. 18 రకాల యాంటీబయాటిక్స్‌ను ఆయన శరీరంలోకి పంపుతున్నారు. ఇదంతా బయటి ప్రపంచానికి తెలియనివ్వడం లేదు.
సత్యసాయి బందీగా మారిన పరిస్థితి ఈనాటిది కాదు. ఒక్క రోజులో జరిగిన పరిణామమూ కాదు. ఏళ్ల తరబడి కొందరి చేతుల్లో చిక్కుకుపోయిన సత్యసాయి.. శారీరకంగా దుర్భలుడిగా మారుతున్న కొద్దీ ఆ దుర్మార్గులు విజృంభించారు. ఈ విషయాన్ని సాయికి అత్యంత సన్నిహితంగా ఉండే పలువురు ముందుగానే సర్కారు చెవిన వేసినా ఫలితం లేకపోయింది. ఇదంతా ఎందుకు జరుగుతోంది.
ఎందుకింత రహస్యం పాటిస్తున్నారు? ఏమిటీ దాగుడు మూతలు? త్వరలో ఈ గుట్టూ రట్టు కాక మానదు! ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. సత్యజిత్ సహా ట్రస్ట్‌లోని ముఖ్యులను సైతం ప్రభుత్వం విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇంతటి సాహసానికి ప్రభుత్వం పూనుకుంటుందా? అనేది మాత్రం ప్రశ్నార్థకమే!!

మంత్రానికి శక్తి ఉందా?
మంత్రం ఒక శబ్దం. మౌనంగా మనోవల్మీకంలో జరిగే మంత్రజపాలకి చింతకాయలు రాలుతాయా? ఈ ఆధునిక యుగంలో,బిజీలో, గజిబిజీలో మనోభావాలకి తావెక్కడ అనిపిస్తుంది! కానీ ఆశ్చర్యమేమిటంటే ఒకపక్కన మన భారతీయ సంస్కృతి గురించి మనమే యోచిస్తుంటే ఇంకో పక్క ప్రపంచమంతటా రోజురోజుకి వెలుస్తున్న యోగ ధ్యాన కేంద్రాలు, వాటినిండా ఎందరో దేశ విదేశాల వారు మన అష్టాంగ మార్గాన్ని, ఆసనాలని, మంత్ర సాధనలని నేర్చుకుంటున్నారు. ఈ రంగాలలో బహుశా మనకన్నా వారే పురోగమిస్తున్నారేమో అనిపిస్తుంది. Art of living, Transcendental Meditation, ఇంకా ఎన్నో విశేషమైన పద్ధతులు ప్రపంచ వ్యాప్తమవుతున్నాయి.
మంత్రాలని గురించి మనం మాట్లాడే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు పరిశీలించాలి. మనం ఈ రోజు పాల సీసా నించి ప్లాస్మా టీవీ దాకా వాడుతున్నాం, ఆనందిస్తున్నాం. అందుకు మూలం రసాయనశాస్త్రంలో (Chemistry) మనం సాధించిన ప్రగతి అని అందరికీ తెలుసు. విచిత్రమేమిటంటే రసాయనశాస్త్రం ఒకప్పుడు రసవాదంతో (Alchemy) మొదలైంది. లోహాలని బంగారంగా మార్చాలన్న మానవ తపన తన చుట్టూవున్న మూలకాలని, లోహ సంయోగ ధర్మాలని అధ్యయనం జరిగేలా చేసింది, బంగారం చేయలేక పోయినా అదే ఈ రోజు బంగారం కన్నా విలువైన వైజ్ఞానిక ప్రగతిని ఇచ్చింది, మానవాళిని ఖండాంతర, గోళాంతర గతిలో తీసుకు వెడుతోంది. అందుకే అనిపిస్తుంది ఏ శాస్త్రాన్ని, విజ్ఞాన రంగాన్ని తక్కువ అంచనా వేయలేము అని.
మంత్రం మనోనిర్మితం.మనస్సుకి ఇంత శక్తి వుందా అని ఆశ్చర్యపోనక్కర్లేదు. మామూలుగా పెన్ను పక్కన పెట్టుకుని మర్చిపోయే మనుషులు హిప్నటైజ్ చేయబడ్డపుడు ఎంతో కాలం క్రితం జరిగిన చిన్న చిన్న సంఘటనలని జ్ఞాపకం చేసుకోగలగడం, పూస గుచ్చినట్లు చెప్పగలగడం పైగా మంచు గడ్డల మీద మంచం మీద పడుకున్నట్లు పడుకోగలగడం ఇవన్నీ మనసుకి సహజంగా వుండే మహాశక్తికి అతిచిన్న మచ్చు తునకలు. మనిషి అంతరంగంలో ఆ మేధస్సులో (Subconscious) ఎన్ని రహస్యాలున్నాయో అనిపిస్తుంది. మనలో దాగిన ఈ శక్తి కనీసం 5% ఐనా మనం వాడుతున్నమా అనిపిస్తుంది. Math Bee,Spelling Bee లాంటి వాటిలో చిన్నారుల ప్రతిభ చూస్తే వారి మేధస్సుకి వారికే కాదు ఒక్కొసారి మానవ జీవితాన్ని, తెలివిని ఇచ్చిన ఆ దేవుడికి కూడా నమస్కరించాలనిపిస్తుంది.
ఒకప్పుడు భూమి గుండ్రంగా వుంది అంటే నవ్వారు. అది ఇప్పుడు శాస్త్రమైంది. యోగం, ధ్యానం పాతచింతకాయ్ పచ్చడి అనుకున్నాం. ఇప్పుడు వాటిని అందరూ శాస్త్రీయంగా భావిస్తున్నారు. విచిత్రమేమిటంటే ప్రపంచ చరిత్రను మార్చిన అనేకమంది శాస్త్రవేత్తలు., వేదాంతులు, సాధకులు, యోగులు కూడా. ఫ్లాటో నించి నీల్స్ బోర్ దాకా అధిభౌతిక తత్వం కనిపిస్తూనే వుంది.
మనస్తత్వ శాస్త్రంతో పరిచయం వున్న చాలా మందికి ఫ్రాయిడ్ తెలుసు. ఫ్రాయిడ్ కి సమకాలికుడైన ఒక మహా మనోవైజ్ఞానికుడు కార్ల్ జంగ్. మతాన్ని,దేవుడిని శాస్త్ర దృక్పధంలోంచి చూపిన ఒక మహానుభావుడు. ఆయన శ్రీ చక్రాన్ని,మంత్ర ఉపాసకుల మండలాలని గురించి యధాతధంగా ఇలా అన్నారు
"Things reaching so far back into human history (like yantras and mandalaas) naturally touch upon the deepest layers of the unconsciousness, and can have a powerful effect on it. Even when our conscious language proves itself to be quite impotent such things can not be thought up but must grow again from the forgotten depths..(from book: Word and Image on Carl Jung"
(మండలం, యంత్రం లాంటివి మానవ చరిత్రలో భాగంగా వున్న సహజ భావాలు.ఇవి మనోప్రవృత్తిలో ఏకమై మన తరతరాలుగా వస్తున్న ఆలోచనా పరంపరలో భాగం. వీటి శక్తి,ప్రభావం అపరిమితం. మన వాడుక భాషకూడా వీటిని వివరించడంలో విఫలమవుతుంది. ఎందుకంటే, వీటిని మనం కల్పించలేం, మళ్ళీ మనం మనావాళిగా మరిచిపోయిన,మస్తిష్కంలో దాగిన ఆ నిక్షిప్త రహస్యాలని మళ్ళీ వెలికి తీసి వృద్ధి చేసుకోవడం తప్ప.. స్వేచ్చానువాదం).
అంతేకాదు మంత్రాన్ని, తరతరాలుగా మానవ పురోగమనంతో బాటు వస్తున్న సం స్కృతి చిహ్నంగాను, అతీతమైన ఓ సృష్టి శక్తి మనిషికిచ్చిన చిన్న సంతకం అని కూడ చెప్పుకో వచ్చు. లోకకల్యాణమే ఆశయంగా పెట్టుకున్న, తపస్సుకే జీవితాన్ని అంకితం చేసిన ఏ యోగికో ఆ మంత్రాన్ని ప్రకృతి మాత అందిస్తే దాన్ని మనం మంత్రం అంటున్నాం, ఆయన్ని మంత్రద్రష్ట అంటున్నాం.అటువంటి మంత్రాలని నిరంతరం ఉపాసించడం ద్వారా అనేకమంది సాధకులు యోగులయ్యారని,లోకోపకారానికి తమ తపస్సుని వినియోగించారని పురాణ ఇతిహాసాలు, వేదాలు చెపుతున్నాయి.అన్ని సంవత్సరాల కృషిని,విజ్ఞాన సంపదని కేవలం ఒక మామూలు విషయంగా చూడలేము కదా!
"Let noble thoughts come from all directions" అంది ఋగ్వేదం.
ఫ్రణవమే సృష్టికి మూల శబ్దమట. "సృష్టి ఆదిలో శబ్దము పుట్టెను" అని బైబిలు కూడా చెబుతోంది.అంతెందుకు మన జీవితంలో ప్రతి కోణం పదాలతో నిండి వుంది. "బాగున్నరా" అనడానికి "బడుద్ధాయి" అనడానికి ఎంతో తేడా వుంది. మనం శబ్దాన్ని విన్నపుడు మనకి అది మనసులో శక్తిగా, దృశ్యంగా రూపం కనిపిస్తుంది. అందుకే గాయత్రి మంత్రాన్ని జపించినపుడు ఆ తేజో రూపశక్తిని బుద్దిని ప్రదీప్తం చెయ్యమని ప్రార్ధిస్తారు. దేవతలని పూజించాలన్నా, ఆవాహన చేయాలన్నా, దర్శించాలన్నా అది కేవలం మంత్రాల వల్లే సాధ్యం అనడానికి అందరికి తెలిసిన ఎన్నో కధలున్నయి. మంత్రాన్ని జపిస్తూ పునరావృతం చేయటం వల్ల మంత్రం సిద్ధించి దేవత అనుగ్రహిస్తుందిట. ఒక రామ మంత్రం బోయ వాణ్ణి వాల్మీకిగా మార్చింది. ఒక కాళీ మంత్రం తెనాలి రామలింగడిని తయారు చేసింది. మంత్రాలు వేదాలలో, పురాణ ఇతిహాసాలలో అస్త్రాలుగా, అమృతతుల్యమైన మహా శక్తులుగా కీర్తింప బడ్డాయి.
అనేక లక్షల సార్లు జపించబడ్డ మంత్రము శక్తిగా, ఆరాధించే దేవత రూపంగా మారుతుంది. పలు మార్లు అయస్కాంతానికి తాకించిన ఇనుప ముక్క అయస్కాంతంగా ఎలా మారుతుందో అలాగే సాధకుని సూక్ష్మ దేహం, ధ్యాన మండలం దేవతాశక్తి క్షేత్రంగా మంత్ర జపం వల్ల మారతాయి. క్రమంగా కన్నులు రెండూ మూసి తదేక దృష్టితో చెసిన మంత్ర జపం వల్ల మూడో కన్ను తెరుచుకుని జ్ఞానాన్ని, కొందరికి దివ్య దృష్టిని ప్రసాదిస్తుంది అని మంత్రశాస్త్రవేత్తలు చెపుతున్నరు. మంత్ర సాధన చేసేవారు అప్పుడప్పుడు ధ్యానంలొ మెరుపులని, దృశ్యాలని అనుభూతి చెందుతారుట. సాధన చెయ్యగా చెయ్యగా చివరికి ఆరాధించే దేవుడు లేక దేవతకి దగ్గరై, సాధకునికి దేవతకి మధ్య ఒక సమతాస్థితి ఏర్పడుతుంది. కొందరు దీక్షాబద్ధులై నిరంతర సాధన వల్ల ఆ దేవత తాలూకు శక్తిని పొంది, కార్య సాధకులుగా, సిద్ధులుగా, జీవన్ముక్తులుగా, పరాముక్తులుగా అవుతారు.
“మననాత్ త్రాయతే ఇతి మంత్రః” అని మంత్రాన్ని నిర్వచించారు ఋషులు. మననం చెయటం వల్ల రక్షించేది మంత్రము అని అర్ధము.జపం వల్ల, మనసులొ పునరావృతం చేయటం వల్ల మంత్రం శక్తి వంతమై సాధకునికి కవచంగా, కల్పతరువుగా అవుతుంది.
వైఖరి,మధ్యమ, పశ్యంతి అని మూడు విధాలుగా మంత్ర జపం చెయ్య వచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి. వైఖరి అంటే గట్టిగా జపం చెయ్యడం. ఇది అంత శక్తివంతం కాదు. మధ్యమ అంటే రహస్యంగా పెదవుల కదలికతో మత్రం వుందేలా జపం చేయడం. ఇది వైఖరి కన్నా మంచి పద్ధతి. ఆఖరిది పశ్యంతి - పూర్తిగా మనసులో చేసే ధ్యానం. అన్నిటికన్నా మంచి పద్ధతి. ఇందులో సాధకులు కేవలం మనసులోనే జపం చేస్తారు. ఈ పద్ధతి జపాన్ని తపస్సుగా, సాధకుడిని యోగిగా మారుస్తుంది. అందుకే కొందరు సాధకుల, స్వాముల సమీపంలో మంచి శాంతం, వారిలో తేజస్సు అనుభూతి చెందుతాము.మంచి సాధన చేసేవారు మరింత ఆనందంగా తయారవుతూ అందరిని ఒకేలా భగవత్స్వరూపంగా ప్రేమగా చూడగలరు.
ఆరాధించే దేవతా స్వరూపాన్ని బట్టి ఆయా తత్వం సాధకుడిని ప్రభావితం చేస్తుంది, అతనిలో ప్రవేశిస్తుంది. కృష్ణుడిని పూజిస్తే కృష్ణతత్వము, కాళిని పూజిస్తే కాళిశక్తి వస్తాయి. అంటే దాని అర్ధం మనిషి కాళి అవుతాడని కాదు, సాధకుని సూక్ష్మ దేహం చుట్టూ కాళిశక్తి వలయం ఏర్పడి అతన్ని అనుగ్రహిస్తూ వుంటుంది. ఎక్కడో కొందరు మహానుభావులకి ఇంకా కొన్ని అపురూపమైన అనుభవాలు కలుగుతాయి. రామకృష్ణ పరమహంస ఆంజనేయ ఉపాసన చేస్తుంటే చిన్న తోక వచ్చిందట. సర్వాంతర్యామి పరబ్రహ్మ స్వరూపాన్ని 'నేను 'గా,సర్వ-ఆత్మగా ఉపాసించే రమణ మహర్షుల వారికి పక్కనే వున్న గడ్డిపై ఎవరో నడుస్తుంటే మహర్షులవారికి నొప్పి కలిగేదట.ప్రసిద్ధులైన అనేకమంది కవులు, పండితులు ఉపాసనల మూలంగా శక్తిని పొందినవారే. మనలొ చాలమందికి పరిచితులైన ఒక మహాత్మునికి అమ్మవారు అనుగ్రహించగా ఆకాశమునుండి అద్భుతంగా ఒక దేవి విగ్రహం ప్రత్యక్షమైందిట. ఆ విగ్రహం ఇప్పటికీ గుంటూరులో వుంది.
కీ||శే|| అద్దంకి కృష్ణమూర్తిగారు మంత్రశక్తితో ఎన్నో చిత్రాలు చూపించేవారు. గాలిలోంచి వస్తువులు సృష్టించడం,దేవుడికి నైవేద్యం పెడితే ప్రసాదం పళ్ళెంతో సహా మాయమవడం లాంటి ఎన్నో సంఘటనలు చూడడం జరిగింది. 'ఆటోబయోగ్రఫి ఆఫ్ ఎ యోగి ' (ఒక యోగి ఆత్మకధ) గ్రంధంలో సాధన గురించి, సిద్ధిని గురించి,భగవదనుగ్రహాన్ని గురించి ఎన్నో విశేషాలు శ్రీ పరమహంస యోగానంద వివరించారు. సూక్షంగా చెప్పాలంటే మంత్రం ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక పాస్ వర్డ్ లాంటిది.మంత్రం దేవతాశక్తికి తాళంచెవి లాంటిది. మంత్రం దివ్యలోకాలకి 'యూ ఆర్ ఎల్ '(web URL) లాంటిది. మంత్రం నిక్షిప్తమైన రహస్యం లాంటిది. మంత్రం సాధకునికి దేవతకి మధ్య వంతెనగా శక్తిని, భక్తిని అందచేస్తుంటుంది అని గురువులంటున్నారు. జపించిన ప్రతిసారి సాధకుని తపన, కష్టం, సాధన స్థితి అన్నీ దేవతకి మంత్రం ద్వారా అందచేయబడతాయి. మామూలు పూజకన్న త్వరగా మంత్రం పై లోకాలకి ప్రయాణం చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.అందుకే గాయత్రి మంత్రం 'తత్ సవితుర్ వరేణ్యం 'అంటుంది. అంటే 'ఆ సూర్యుడిని అర్ధిస్తున్నాం ' అని అర్ధం. ఏ సూర్యుడిని అని ప్రశ్నిస్తే 'ఏ సూర్యుడయితే భూ లోక, భువర్లోక, సువర్లోకాలలో సంచరిస్తున్నాడో - ఆ సూర్యుడన్న మాట '.
ప్రతి మంత్రానికి అర్ధం వుండాలని నియమం ఏమీ లేదు.ఊన్నా ఆ అర్ధం మన మామూలు అర్ధాలలో ఇమడాలని లేదు. ఉదాహరణకి ఒక లక్ష్మీ మంత్రాన్ని చూస్తే,'హ్రీం శ్రీం మహా లక్ష్మియై స్వాహా ' - ఈ మంత్రము ఓం తో ప్రారంభమవలేదు, నమః అని తుదిలోను లేదు. హ్రీం కి ఎన్నో అర్ధాలున్నాయి. హ్రీం అనేది మాయా బీజం. (అంటే మాయమవుతామని కాదు)మాయ బీజం కావటం చేత, ఈ మంత్రం చేయువారికి సర్వ వ్యాపకమైన శ్రీం లభిస్తుంది. అంటే కేవలం పైసలలో వుండే డబ్బు కాకుండా, ఏ లక్ష్మి శ్రీసూక్తంలో విశెషంగా కీర్తించబడిందో అది లభిస్తుంది.
'ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః '
మంత్రమును ఏకాగ్రతతో చేయడం అవసరం అని అందరు అంటారు. నిజమే, కాని అంత తీవ్రమైన ఏకాగ్రత కుదరకపోయినా సాధనలో ప్రగతిని సాధించవచ్చు. మన మంత్రాన్ని మనమే వినడం ద్వారా ఏకాగ్రత పెంపొందించుకోవచ్చును. కొందరు సాధకులు ఏ దేవతని ఉపాసిస్తున్నరో ఆ దేవతని ఎదురుగా వున్నట్లు ఊహించుకుని సాధన చేయడంవల్ల భక్తితో, శ్రద్ధగా మరింత ముందుకి వెడతారు.
మంత్రాలు బీజాక్షరాల సముదాయం. 'బీజాక్షరాలు ' అంటే విత్తనాల లాంటివి అన్నమాట.బీజాక్షరాలు కూడ విత్తనాల లాగే ధ్యానభూమికలలో వుంచడం వల్ల మహావృక్షాల్లా పెరిగి అనుగ్రహం కలుగచేస్తాయి. గోల్ఫ్ ఆడేవారికి క్లబ్ ఎలాగో, మంత్ర జపానికి మాల అలా అవసరం. రుద్రాక్షమాలని జ్ఞానానికి, మనోశక్తికి, సిద్ధశక్తులకి వినియోగిస్తారు. తులసి మాలని ఆరోగ్యానికి, శాస్త్రజ్ఞానానికి, నిర్మలత్వానికి వుపయోగించవచ్చును. ఎర్రచందనం మాలతో కామ్యసిద్ధి, తామరపూస మాలతో జపం చెస్తే లక్ష్మి ప్రసన్నత కలుగుతాయని మంత్ర మహోదధి, మేరు తంత్రము, రుద్రయామళము వంటి గ్రంధాలు చెబుతున్నాయి. ఆవిధంగా మాల కేవలం జపం లెక్కించటానికే కాక మంత్రసిద్ధిలో కూడా ఉపయోగిస్తుంది.
ఇలా మంత్రసాధనలని చేసి ఈ ఆధునిక యుగంలోనూ అతీంద్రియ శక్తులను సాధించవచ్చునని అనేక గ్రంధాలే కాక నిజమైన జ్ఞానాన్ని, నిర్మలమైన ధ్యానాన్ని నమ్మిన గురువులు సూచిస్తున్నారు.

Thursday, April 14, 2011
అమ్మ
అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుంఢా ఆబద్దమే... ఎందుకంటే... తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదుకాబట్టి. మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ". శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మా". అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే.. ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ". "ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా? ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే. అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి స్వాగతం...సుస్వాగతం...అమ్మ గురించి మట్లాడండి ఆ మాట కు ఉన్న విలువ ని మారింత పెంచండి... ఒక్క మాట::అమ్మ గురించి మీకు తెలియదు అని కాదు..నాకు తెలిసింది మీతొ పంచుకోవడానికే ఈ "అమ్మ ప్రేమ"
అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే -- ఆత్రేయ
* పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా
మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ -- చంద్రబోస్
* అమ్మను మించి దైవమున్నదా....జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
తప్పటడుగులేసిన చిన నాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు...
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే ఐనా నీ ముంగిట అదే అదే పసివాడినే
కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా
కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా
కణకణలాడే ఎండకు శిరసు మాడినా మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ
చారేడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
ప్రతి తల్లికి మమకారం పరమార్ధం మదిలేని అహంకారం వ్యర్ధం వ్యర్ధం ----....--సినారె
* ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో
ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... --సిరివెన్నెల
* అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట
దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు
తల్లిప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లిసేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు
అమ్మంటే అంతులేని సొమ్మురా, అది యేనాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరకీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ ---దాశరధి
* పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే---వేటూరి
అమ్మ గురించి తెలుగు కవుల కమ్మని పలుకులు

ఇక సెల్‌ఫోనే ఏటీఎం!
ఇంట్లో పర్సు మర్చిపోయారా? క్రెడిట్ కార్డ్‌లో క్యాష్ లేదా? మొబైల్ చేతిలో ఉంటే చాలు! ఎలాంటి చింతా అక్కర్లేదు! ఎందుకంటే సెల్‌ఫోనే ఇక ఏటీఎం! అదెలాగో చూద్దాం!
అనిల్ ఫ్యామిలీతో సినిమా హాలుకి వెళ్లి చూసుకుంటే జేబులో పర్సులేదు. అప్పుడు ఏం చేసుంటాడు? 'తెలిసిన వారికి ఫోన్ చేసి డబ్బు తెప్పించుకుని ఉంటాడు' అనుకుంటే, ఏటీఎంకి వెళ్లి పిన్‌నెంబర్ తప్పుకొట్టినట్టే! ఎందుకంటే అనిల్ సెల్‌ఫోన్ బయటకి తీసి అందులోంచే సినిమా టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. సినిమా అయ్యాక అట్నుంచటే షాపింగ్‌కు వెళ్లి సెల్‌ఫోన్ ద్వారా 'ఎంచెక్'తో సొమ్ము చెల్లించాడు. ఇది కేవలం ఉదాహరణే కాదు, ఇప్పుడు మొబైల్ చేతిలో ఉంటే కరెన్సీకానీ, ప్లాస్టిక్ కార్డులు కానీ అక్కర్లేదు. రైలు టిక్కెట్లు, కరెంటు బిల్లు, బీమా ప్రీమియం, కేబుల్ బిల్లు... ఇలా ఎన్ని చెల్లింపులైనా సెల్ ద్వారా చేసేయవచ్చు.
మోడల్ ఏదైనా!
కేవలం మెసేజ్ పంపే వీలున్న సెల్లయినా, జీపీఆర్‌ఎస్ సదుపాయం ఉన్న ఆధునిక సెల్ అయినా, మొబైల్ బ్యాకింగ్ సౌకర్యం ఇప్పుడు సర్వసాధారణమై పోయింది. డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు ఉంటే చాలు ఆయా సర్వీసుల్లోకి సైన్‌ఇన్ అయ్యి సెల్‌ఫోన్‌ను ఏటీఎంలా మార్చేయవచ్చు. మొబైల్‌లోకి ఇన్‌స్టాల్ చేసుకునే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ల ద్వారా హోటళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్‌కు అనుసంధానమై ఆన్‌లైన్ బ్యాకింగ్ చేయవచ్చు. అప్లికేషన్లను వద్దనుకున్నా ప్రత్యేక ప్రీపెయిడ్ ప్యాకెజీలను కూడా నెట్‌వర్క్ సంస్థలు అందిస్తున్నాయి. అందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ ఫోన్ ఆపరేటర్లకు అనుమతిచ్చింది. Semi Closed Mobile Walletగా వీటిని పిలుస్తున్నారు. సభ్యులైతే టాక్‌టైం రీఛార్జ్ చేసుకున్న మాదిరిగా ఆయా నెట్‌వర్క్ సెంటర్లతో కొంత మొత్తాన్ని ఎకౌంట్‌లోకి వేసుకుంటే చాలు, ఎక్కడైనా మొబైల్ నుంచే డబ్బు చెల్లించవచ్చు.
ఇవిగో మార్గాలు
* ఎన్‌జీపే
ఇది ఉంటే జేబులో షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నట్టే. ట్రావెల్ విభాగంలో రైలు, విమానం, బస్ టిక్కెట్లను బుక్ చేయవచ్చు. ఎంటర్‌టైన్మెంట్‌లో సినిమా టిక్కెట్లు తీసుకోవచ్చు. షాపింగ్ విభాగంలో గ్యాడ్జెట్‌లు, మ్యూజిక్, పుస్తకాలు... ఇలా దేన్నయినా చిటికెలో కొనుగోలు చేయవచ్చు. సుమారు 100 కంపెనీల భాగస్వామ్యంతో వివిధ రకాల ఉత్పత్తుల్ని అందిస్తున్నారు. వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయాలి. MPINతో సర్వీసుని ఓపెన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాల్ని నమోదు చేయాలి. సైట్ నిర్వాహకులు బ్యాంక్ వివరాల్ని సమీక్షించి చెల్లింపులకు అనుమతి ఇస్తారు. ఇంటర్నెట్ ఎనేబుల్ మొబైల్‌లో ఉచితంగా ఎన్‌జీపే సర్వీసుని పొందొచ్చు. www.ngpay.com
* ఎంచెక్
సాధారణ మొబైల్‌తోనూ చెల్లింపులు చేయాలంటే ఎంచెక్‌ను వాడొచ్చు. ఎసెమ్మెస్ పంపడం ద్వారా బిల్లుల్ని చెల్లించడం ప్రత్యేకత. ఆరు అంకెల ఎంచెక్‌పిన్ నెంబర్‌తో బ్యాంకు లావాదేవీలను సురక్షితం చేసుకోవచ్చు. సైట్‌లో మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే డౌన్‌లోడ్ లింక్ మెసేజ్ వస్తుంది. ఇన్‌స్టాల్ చేసుకుని డెబిట్, క్రెడిట్ కార్డు వివరాల్ని ఎంటర్ చేసి సౌకర్యాలు పొందచ్చు. మొత్తం చెల్లింపు ప్రక్రియ ఎన్‌క్రిప్ట్ పద్ధతిలో సురక్షితంగా ముగుస్తుంది. www.mchek.com
* ఎయిర్‌టెల్ మనీ
ఇదో మొబైల్ పేమెంట్ సర్వీసు. దీన్ని మొబైల్‌లో యాక్టివేట్ చేసుకోవాలంటే ఐడీ, అడ్రస్ వివరాలతో రిజిస్టర్ చేసుకుని, సిమ్‌కార్డ్‌ను అప్‌గ్రేట్ చేసుకోవాలి. ఆపై ఎయిర్‌టెల్ మనీలో కొంత మొత్తాన్ని టాప్‌అప్ చేయాలి. ఇక ఆ మొత్తంతో బిల్లుల్ని చెల్లించవచ్చు. ఎయిర్‌టెల్ వినియోగదారులు కాకపోయినా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో కొన్ని చోట్లే అందుబాటులో ఉంది.www.airtelmoney.in
* మొబైల్ మనీ సర్వీసులు
యస్ బ్యాంకుతో కలిసి నోకియా కంపెనీ పూనె, ఛండీఘర్‌లో ఈ సౌకర్యాల్ని అందిస్తోంది. Easy Pay, Easy Send పద్ధతుల్లో చెల్లింపు వ్యవహారాల్ని చేయవచ్చు. 'ఈజీ పే'తో బిల్లు చెల్లిపులు చేస్తే, 'ఈజీ సెండ్' ద్వారా ఇతరుల మొబైల్ ఎకౌంట్‌లోకి డబ్బులు పంపొచ్చు. అంటే మొబైల్ మనీ సర్వీసుల్లో సభ్యులైన వినియోగదారులు ఒకరి Mobile Wallet నుంచి మరొకరి Mobile Walletలోకి డబ్బుని ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఏదైనా ఎస్ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బుని డ్రా చేయవచ్చు కూడా. ఈ సర్వీసులో సభ్యులవ్వాలంటే ప్రత్యేక ఏజెంట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఏజెంట్ మొబైల్ ఎకౌంట్‌ను క్రియేట్ చేశాక దాంట్లో కొంత మొత్తం డిపాజిట్ చేయాలి. అయితే జీపీఆర్‌ఎస్ సదుపాయం తప్పనిసరి. www.mobilemoneyservices.co.in
* ఎం-పైసే
కెన్యా, జపాన్ దేశాల్లో మొబైల్ వినియోగదారుల్ని ఆకట్టుకున్న 'ఎం-పైసే' సౌకర్యాల్ని ఎయిర్‌టెల్, వొడాఫోన్ నెట్‌వర్క్ కంపెనీలు దేశంలో అందుబాటులోకి తేనున్నాయి. అందుకు ఐసీఐసీఐతో ఒప్పందానికి సిద్ధం అవుతున్నాయి.
* దేశంలో సుమారు 650 మిలియన్ల మొబైల్ వినియోగదారులు ఉన్నప్పటికీ ఎన్‌జీపేలో ఒక మిలియన్, ఎంచెక్‌లో రెండు మిలియన్ల సభ్యులు మాత్రమే రిజిస్టరయ్యారు. మొత్తం వినియోగదారుల్లో బ్యాంకు వ్యవహారాల్ని మొబైల్‌లో చేస్తున్నవారి శాతం చాలా తక్కువే.
* డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాల్ని థర్డ్‌పార్టీ అప్లికేషన్స్‌తో వాడేప్పుడు ఆయా సర్వీసుల్లోని సెక్యూరిటీ లెవెల్స్ చూడాలి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అన్ని మొబైల్ బ్యాకింగ్ వ్యవహారాలు Two-Way Authenticationతో సురక్షితంగానే సాగుతున్నాయి. ప్రతి లావాదేవీలో పిన్ నెంబర్ కచ్చితంగా అడుగుతారు. ఏటీఎం పిన్ నెంబర్ మాదిరిగా ప్రతిసారీ ఆరు అంకెల పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిందే.
జాగ్రత్త సుమా!
* ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తున్నట్లయితే మొబైల్‌ని సెక్యూరిటీ పిన్ కోడ్‌తో లాక్ చేయండి.
* పాస్‌వర్డ్‌లను బ్రౌజర్‌లో సేవ్ చేయకండి.
* రిమోట్ వైపింగ్ ప్రోగ్రాంలతో వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తొలగించడం మంచిది.
* వ్యక్తిగత వివరాల్ని తెలుపమని వచ్చే మెసేజ్‌లకు స్పందించకండి.
* బ్యాంకింగ్ అప్లికేషన్లను అధికారిక సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి.
* క్లిష్టమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోండి.